RTI చట్టం, 2005 పాలనలో ఆచరించే గోప్యత మరియు అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించడానికి పౌరులకు అధికారం ఇస్తుంది.
RTI సమాచారాన్ని ప్రజా ప్రయోజనంగా పరిగణించవచ్చు, ఎందుకంటే ఇది పౌరుల ప్రయోజనాలకు సంబంధించినది మరియు పారదర్శక మరియు శక్తివంతమైన ప్రజాస్వామ్యం యొక్క పనితీరుకు కీలకమైన స్తంభం.
పొందిన సమాచారం ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయడంలో మాత్రమే కాకుండా సమాజం యొక్క మొత్తం ప్రయోజనాలకు ఉపయోగపడే ఇతర ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుంది.
ప్రతి సంవత్సరం, RTI చట్టం క్రింద దాదాపు ఆరు మిలియన్ల దరఖాస్తులు దాఖలు చేయబడుతున్నాయి, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే చట్టం.
ఈ అప్లికేషన్లు ప్రాథమిక హక్కులు మరియు అర్హతల పంపిణీకి ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా ఉంచడం నుండి దేశంలోని అత్యున్నత కార్యాలయాలను ప్రశ్నించడం వరకు అనేక సమస్యలపై సమాచారాన్ని కోరుకుంటాయి.
RTI చట్టాన్ని ఉపయోగించి, ప్రజలు అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన మరియు రాష్ట్రం చేసిన తప్పులను బహిర్గతం చేసే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు వెల్లడించడానికి ఇష్టపడని సమాచారాన్ని కోరుతున్నారు.
పౌరుల జీవితాలను ప్రభావితం చేసే విధానాలు, నిర్ణయాలు మరియు ప్రభుత్వ చర్యల గురించిన సమాచారాన్ని పొందడం అనేది జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఒక సాధనం.
సుప్రీంకోర్టు అనేక తీర్పులలో, RTI అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మరియు21 నుండి ప్రవహించే ప్రాథమిక హక్కు అని పేర్కొంది, ఇది పౌరులకు వాక్ స్వాతంత్ర్యం మరియు భావవ్యక్తీకరణ మరియు జీవించే హక్కుకు హామీ ఇస్తుంది.
మన దేశంలో సమాచార హక్కు చట్టం (Right to Information act) 2005లో అమల్లోకి వచ్చింది. దేశ పౌరులందరూ ప్రభుత్వ యంత్రాంగాలకు సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని నియమాలను చట్టం నిర్వచించింది. గతంలో ఉన్న ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 స్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. పౌరులు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు, కొన్ని సందర్భాల్లో 48 గంటల్లోపు అందివ్వాలని చట్టం చెబుతోంది. దీంతోపాటు వివిధ సంస్థల రికార్డులను కంప్యూటరైజేషన్ చేసి ప్రచురించాలని, ప్రజలు సమాచారం కోసం అభ్యర్థించడానికి అవసరమైన కనీస సహాయం అందజేయాలని చట్టంలోని వివిధ సెక్షన్లు చెబుతున్నాయి.
* సమాచార హక్కు చట్టం 2005 అంటే ఏమిటి?
దేశ ప్రజలకు వివిధ ప్రభుత్వ సంస్థలు, యంత్రాంగాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కును సమాచార హక్కు చట్టం కల్పించింది. సమాచార హక్కుకు సంబంధించిన నియమ నిబంధనలు, విధి విధానాలను ఈ చట్టం నిర్దేశిస్తుంది. దేశ పౌరులు కోరిన సమాచారాన్ని 30 రోజులలోపు ఇవ్వాలని చట్టంలో పొందుపరిచారు.
* సమాచారం (information) అంటే ఏంటి?
రికార్డులు, డాక్యుమెంట్లు, ఈ-మెయిల్స్, ఒపీనియన్స్, పత్రికా ప్రకటనలు, ఆర్డర్లు... వంటివన్నీ సమాచారం కిందకు వస్తాయి. ఏదైనా ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న డేటా కూడా సమాచారం కిందకు వస్తుంది. కొన్నిసార్లు చట్ట ప్రకారం ప్రైవేటు సంస్థల సమాచారాన్ని సైతం ప్రభుత్వ యంత్రాంగాలు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఆ చట్టాలు అమల్లో ఉన్నంత వరకు, ఇలాంటి ప్రైవేటు సంస్థల డేటా కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది.
* ఆర్టీఐ దాఖలు చేసే విధానం
సమాచారం కోరే పౌరుడు దరఖాస్తును సంబంధిత విభాగానికి చెందిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO)కు పంపించాల్సి ఉంటుంది. దీనికి రూ.10 మాత్రమే ఖర్చవుతుంది. ఒకవేళ 30 రోజుల్లో సమాధానం రాకపోతే, కేంద్ర సమాచార కమిషన్ (CIC)ని సంప్రదించాల్సి ఉంటుంది.
* ఆర్టీఐ అప్లికేషన్‌కు నిర్దిష్ట ఫార్మాట్ ఏదైనా ఉందా?
సమాచారం కోరే దరఖాస్తుకు కచ్చితమైన ఫార్మాట్ అంటూ ఏదీ లేదు. కానీ దరఖాస్తుదారుడి పేరు, పూర్తి చిరునామాతో పాటు ఇతర వివరాలను అప్లికేషన్‌లో పొందుపరచాలి.
* సమాచారం కోరే వ్యక్తి, అందుకు కారణాలు కూడా చెప్పాలా?
ఆర్టీఐ కింద సమాచారం కోరేవారు ఎలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వ పాలనకు సంబంధించిన, వెలుగులోకిరాని అనేక అంశాలను గూర్చి తెలుసుకోవడానికి సమాచారహక్కు సామాన్య ప్రజలకు సైతం ఆయుధంగా మారింది. దానిని గూర్చి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ప్రకరణ19లో అంతర్గంగా పొందుపరిచారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పాలకులు తీసుకొనే నిర్ణయాలు, వాటిని ఏ ప్రాతిపదికన తీసుకున్నారనే సమాచారం తదితర విషయాలు ప్రజలకు తెలియాల్సి ఉంటుంది. అలా తెలపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలను సమాచార హక్కు ద్వారా ప్రజలు తెలుకునే అవకాశం ఉండాలి. అంటే ప్రభుత్వానికి సంబంధించిన వివిధ ఫైళ్లు, డాక్యుమెంట్లు, రిపోర్టులు, నిర్ణయాలు, ప్రభుత్వ పనితీరు మొదలైన అంశాలకు సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వం పారదర్శకతతో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేకపోతే అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి అవకాశం ఉంటుంది. సమాచార హక్కు చట్టం-2005 సమాచార హక్కు చట్టాన్ని పార్లమెంటు 2005లో రూపొందించింది. జూన్15, 2005లో రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేశారు. అదే ఏడాది అక్టోబర్ 12 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. పాలనలో పారదర్శకతను సాధించడమే ఈ చట్ట ప్రధాన ఉద్దేశం. ముఖ్యాంశాలు: • ఈ చట్టం ప్రకారం ప్రతి శాఖలో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను నియమిస్తారు. ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులో అందించడమే ఆయన ప్రధాన బాధ్యత. • సాధారణ సమాచారమైతే 30 రోజల్లోగా, జీవించే హక్కుకు, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే48 గంటల్లో ఇవ్వాలి. దీనికోసం నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. • ప్రజలు కోరిన సమాచారాన్ని అందించడంలో అధికారులు విఫలమైతే వారిపై వచ్చే ఫిర్యాదులను సమాచార కమిషన్లు విచారిస్తాయి. • చట్టం నిర్దేశించిన మేరకు సమాచారం అందించని అధికారులకు నిర్ణీత గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 25 వేల వరకు జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
(1) ఈ చట్టం కింద సమాచారాన్ని కోరదల్చుకున్న వారు ఇంగ్లీషులో లేక హిందీలో లేక స్థానిక అధికార భాషలో రాతపూర్వకంగా లేక ఎలక్ట్రానిక్ రూపంలో నిర్ణీత రుసుంతోపాటు తమ అభ్యర్ధనను కింది వారికి పంపించాల్సి ఉంటుంది.
(ఎ) కేంద్ర పౌర సమాచార అధికారికి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారికి లేదా సంబంధిత అధికార యంత్రాంగానికీ.
(బి) తాము కోరుకున్న సమాచారం వివరాలను పేర్కొంటూ కేంద్ర పౌర సమాచార అధికారికీ లేక ప్రతి రాష్ట్ర పౌర సమాచార అధికారికీ సమాచారం కోరుతున్న వారు లిఖిత అభ్యర్ధన ఇవ్వలేనిపక్షంలో మౌఖికంగా వారు చేసిన అభ్యర్ధనను రాతలో పెట్టేందుకు కేంద్ర పౌర సమాచార అధికారి లేక ప్రతి రాష్ట్ర పౌర సమాచార అధికారి యుక్తమైన సహాయమంతా వారికి అందించాలి.
2. సమాచారం కోరుతున్న దరఖాస్తుదారులెవరైనా అందుకు గల కారణాలను వివరించాల్సిన అవసరం లేదు. తనకు కబురుచేసేందుకుఅవసరమైన వివరాలు మినహా ఎలాంటి వ్యక్తిగత వివరాలు కూడా సమర్పించాల్సిన పనిలేదు.
3. ఒక సమాచారం కోసం అధికార యంత్రాంగానికి ఒక దరఖాస్తు అందినప్పుడు
(i) ఆ సమాచారం మరో అధికార యంత్రాంగం దగ్గర ఉన్నప్పుడు, లేక
(ii) ఆ సమాచారం మరో అధికార యంత్రాంగం పనులకు ఎక్కువగా సంబంధించినదైనప్పుడు, దరఖాస్తు అందుకున్న అధికారయంత్రాంగం ఆ దరఖాస్తును గానీ లేక రెండవ అధికార యంత్రాంగానికి సంబంధించిన భాగాన్ని గానీ వారికి పంపించి..అలా పంపినవిషయాన్ని దరఖాస్తుదారునికి తెలియజేయాలి. ఆ దరఖాస్తును పంపడం వీలైనంత త్వరగా జరగాలి. అది దరఖాస్తు అందుకున్ననాటి నుంచి అయిదు రోజులు మించకూడదు.
సమాచార చట్టం-2005 ప్రకారం మీరు ఏ పబ్లిక్ అథారిటీనుంచి అయినా
సమాచారం కోరవచ్చు (పబ్లిక్ అథారిటీ అంటే ప్రభుత్వ సంస్థ, లేదా, ప్రభుత్వ
ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థ) దరఖాస్తు ఫారాన్ని వ్రాయాలి, లేదా టైప్ చేయాలి.
దరఖాస్తు ఇంగ్లీషు, హిందీ, లేదా ఏదైనా రాష్ట్రానికి చెందిన భాషలోనే వుండాలి
మీ దరఖాస్తులో ఈ కింది సమాచారాన్ని తెలియజేయండి
సహాయ పౌర సమాచార అధికారి (ఏ పి ఐ ఓ) /
పౌర సమాచార అధికారి (పి ఐ ఓ) పేరు ,
కార్యాలయం చిరునామా
విషయం: దరఖాస్తు-సమాచార చట్టం-2005 సెక్షన్ 6(1) ప్రకారం
పబ్లిక్ అథారిటీనుంచి మీకు కావలసిన సమాచారం వివరాలు
దరఖాస్తుదారు పేరు
తండ్రి / భర్త పేరు
కేటగిరి: ఎస్సి / ఎస్టి / ఓబిసి
దరఖాస్తు రుసుము
మీరు పేద (బిపిఎల్) కుటుంబానికి చెందినవారా? అవును / కాదు
మీ పోస్టల్ చిరునామా, మొబైల్ ఫోన్ నంబరు, ఇ-మెయిల్ ఐడి
(అయితే, ఇ-మెయిల్ ఐడి ని పేర్కొనడం తప్పనిసరి కాదు)
తేదీ, ఊరు
దరఖాస్తుదారు సంతకం
జతపరుస్తున్న పత్రాల జాబితా
దరఖాస్తు దాఖలుచేసే ముందు సహాయ పౌర సమాచార అధికారి /
పౌర సమాచార అధికారి పేరు, నిర్దేశించిన సుంకం, చెల్లించవలసిన
తీరు సక్రమంగా వున్నది లేనిది సరిచూసుకోండి
సమాచార హక్కు (ఆర్టి ఐ) చట్టం కింద, సమాచారం పొందడానికి దరఖాస్తు
రుసుం చెల్లించవలసి వుంటుంది. అయితే, ఎస్ సి / ఎస్ టి / బి పి ఎల్ కుటుంబాలకు చెందినవారికి సుంకంనుంచి మినహాయింపు వుంది. సుంకం మినహాయింపుకోరేవారు ఎస్ సి / ఎస్ టి / బి పి ఎల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని జతచేయవలసి వుంటుంది.దరఖాస్తును స్వయంగా, లేదా పోస్టు ద్వారా, లేదా ఇ-మెయిల్ ద్వారానైనా పంపవచ్చు.పోస్టుద్వారా పంపదలచుకుంటే, రిజిస్టర్డ్ పోస్టుద్వారానే పంపాలి. దరఖాస్తు పత్రాలకు (అంటే, దరఖాస్తు ఫారము, సుంకం చెల్లింపు రసీదు, స్వయంగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు సమర్పించినట్టు రసీదు) రెండు జిరాక్స్ కాపీలు తీయించుకుని తర్వాతిఅవసరాలకు వీలుగా మీ వద్ద వుంచుకోండి.
మీరు స్వయంగా దరఖాస్తు అందజేస్తుంటే, ఆ కార్యాలయంనుంచి రసీదు తీసుకోండి.ఆ రసీదుపై తేదీ, ఆ కార్యాలయం ముద్ర స్పష్టంగా వుండేలా జాగ్రత్త వహించండి.దరఖాస్తును పోస్ట్ ద్వారా పంపదలచుకుంటే, దానిని రిజిస్టర్డ్ పోస్ట్లో పంపి ఆ రసీదునుభద్రంగా వుంచుకోండి ఆ దరఖాస్తు పౌర సమాచార అధికారికి అందిన తేదీనుంచి ,సమాచారం అందజేయడానికి గడువును లెక్కించడం జరుగుతుంది.
1. మొదటి అప్పీలు దరఖాస్తును ఎప్పుడు దాఖలుచేయాలి?
మీరు కోరిన సమాచారాన్ని అందించకుండా, పౌర సమాచార అధికారి మీ దరఖాస్తును తిరస్కరిస్తే, అధికార యంత్రాంగం నిర్ణీత గడువు, 30 రోజులు లేదా 48 గంటల లోగా, సమాచారాన్ని అందించలేకపోతే,మీ దరఖాస్తును స్వీకరించవలసిన, లేదా మీరు కోరిన సమాచరాన్ని అందించవలసిన సహాయ పౌర సమాచార అధికారిని / పౌర సమాచార అధికారిని ప్రభుత్వ యంత్రాంగం నియమించివుండకపోతే,
దరఖాస్తును స్వీకరించడానికి, దానిని పౌర సమాచార అధికారికి పంపడానికి సహాయ పౌర సమాచార అధికారి నిరాకరిస్తే, పౌర సమాచార అధికారి ఇచ్చిన తీర్పు మీకు సంతృప్తికరంగా లేకపోతే, మీకు అందించిన సమాచారం అసమగ్రంగావున్నదనో, తప్పుదారి పట్టించేదిగా వున్నదనో, అసత్య సమాచారమనో మీరు భావిస్తే,
మిమ్ములను చెల్లించమనికోరిన రుసుము సహేతుకంగా లేదని మీరు భావిస్తే,
సమాచారహక్కు చట్టం -2005 Section 19(1) ప్రకారం మొదటి అప్పీలు దాఖలుచేయాలి.
2. మొదటి అప్పీల్కు గడువు
నిర్దేశించిన గడువు ముగిసిన, లేదా , రాష్ట్ర పౌర సమాచార అధికారి (ఎస్పీఇఓ) / కేంద్ర పౌర సమాచార అధికారి (సిపీఇఓ) కార్యాలయంనుంచి ( మీ విజ్ఞప్తి పై తీర్పుచెబుతూ లేదా మీ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ) సమాచారం అందిన 30రోజులలోగా దరఖాస్తుదారు అనివార్య కారణాలవల్ల 30 రోజులలోగా దరఖాస్తు చేయలేకపోయినట్టు మొదటి అప్పిలేట్ అధికారి సంతృప్తి చెందితే, 30 రోజుల తర్వాతకూడా, అప్పీలును అనుమతించవచ్చు
3. మొదటి అప్పీలును ఎలా వ్రాయాలి
తెల్ల కాగితం మీద మీ దరఖాస్తును వ్రాసి సమర్పించవచ్చు. దరఖాస్తు, వ్రాసినదో టైప్ చేసినదో మాత్రమే అయివుండాలి దరఖాస్తును ఇంగ్లీషు, హిందీ లేదా రాష్ట్రానికి చెందిన ఏదైనా భాషలో మాత్రమే వ్రాయాలి అవసరమైన సమాచారాన్ని, నిర్దేశించిన రీతిలో స్పష్టంగా పేర్కొనాలి మీదరఖాస్తు ఫారానికి, స్వయంగా ధ్రువీకరించిన మీ విజ్ఞప్తి పత్రం జిరాక్స్ కాపీని, దరఖాస్తు రుసుము రసీదును, మీ విజ్ఞప్తి పత్రం అందినట్టు పౌర సమాచార అధికారినుంచి వచ్చిన అక్నాలెడ్జిమెంటు కార్డును, తీర్పు కాపీని జతపరచాలి దరఖాస్తు ఫారాన్ని, దానికి జతపరచిన అన్ని పత్రాలను ఒక కాపీ జిరాక్స్ తీయించుకొని మీవద్ద వుంచుకోండి
4. మొదటి అప్పీలు దరఖాస్తును ఎక్కడ సమర్పించాలి
మీ విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించిన యంత్రాగ కార్యాలయంలోనే మొదటి అప్పిలేట్ అధికారికి మీ దరఖాస్తును సమర్పించాలి అధికార క్రమంలో, మొదటి అప్పిలేట్ అధికారి పౌర సమాచార అధికారికంటే పై అధికారి అయి వుంటూ; దరఖాస్తును స్వీకరించే, కోరిన సమాచారాన్ని అందించే లేదా దరఖాస్తును తిరస్కరించే బాధ్యత కలిగివుంటారు.
మొదటి అప్పీలు దరఖాస్తును సమర్పించే ముందు, ఆ దరఖాస్తులో మొదటి అప్పిలేట్ అధికారి పేరును సరిగా పేర్కొన్నదీ లేనిది సరిచూసుకోండి (మొదటి అప్పీలు దరఖాస్తుకు రుసుము లేదు).
5. మొదటి అప్పీలు దరఖాస్తును ఎలా పంపాలి
దరఖాస్తును స్వయంగా అందజేయాలి , లేదా పోస్టుద్వారా పంపాలి పోస్టు ద్వారా పంపదలచుకుంటే, రిజిస్టర్ పోస్టుద్వారా మాత్రమే పంపాలి. స్వయంగా అందించినా, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపినా కూడా తప్పనిసరిగా రసీదు తీసుకోవడం మరువవద్దు.
6. మొదటి అప్పీలు నిర్ణయం గడువు.
1. సాధారణంగా, 30 రోజులలో నిర్ణయం ప్రకటించాలి, అయితే అసాధారణ సందర్భాలలో 45 రోజులదాకా మినహాయింపు వుంటుంది.
2. దరఖాస్తుపై నిర్ణయాన్ని తెలిపే గడువు, మొదటి అప్పిలేట్ అధికారికి దరఖాస్తు అందినరోజు నుంచి మొదలవుతుంది.
1. రెండవ అప్పీలు దరఖాస్తును ఎప్పుడు దాఖలుచేయాలి
మొదటి అప్పీలు అధికారి తీర్పుతో మీరు సంతృప్తిచెందనపుడు
యంత్రాంగం అందజేసిన సమాచారం సమగ్రంగా లేదనో, తప్పుదారి పట్టించేదిగా వున్నదనో, అసత్య సమాచారమనో మీరు భావిస్తే
పౌర సమాచార అధికారి (పిఎఓ) గాని, లేక మొదటి అప్పిలేట్ అధికారి (ఎఫ్ఏఏ) గాని, లేదా ఇద్దరూ కూడా, దరఖాస్తులో మీరు కోరిన సమాచారాన్ని అందించడానికి నిరాకరిస్తే, నిర్ణీత గడువులోగా అప్పిలేట్ అధికారి ఎలాంటి తీర్పు ఇవ్వకపోతే
మీ దరఖాస్తును స్వీకరించడానికి, లేదా దానిని కేంద్ర / రాష్ట్ర సమాచార అధికారికి, లేదా కేంద్ర / రాష్ట్ర సమాచార కమిషనర్కు పంపడానికి సహాయ పౌర సమాచార అధికారి నిరాకరిస్తే
మీరు దరఖాస్తు చేయడానికి యంత్రాంగం అడిగిన ఫీజు, సమాచారహక్కు చట్టం-2005 ప్రకారం హేతుబద్ధంగా లేదని మీరు భావిస్తే
రెండవ అప్పీలు దాఖలుచేయాలి.
2. రెండవ దరఖాస్తు ఎక్కడ సమర్పించాలి
రాష్ట్ర సమాచార కమిషనర్ (ఎస్ఐసి) కార్యాలయంలో (విషయం రాష్ట్ర యంత్రాంగానికి సంబంధించినదైతే)
కేంద్ర సమాచార కమిషనర్ (సీఇసి) కార్యాలయంలో (విషయం కేంద్ర యంత్రాంగానికి సంబంధించినదైతే)
3. రెండవ అప్పీల్కు గడువు
నిర్దేశించిన గడువు ముగిసిన, లేదా , మొదటి అప్పీల్ అధికార కార్యాలయంనుంచి (మీ దరఖాస్తుపై తీర్పు చెబుతూ లేక మీదరఖాసును తిరస్కరిస్తూ) సమాచారం అందిన 90 రోజుల లోగా
దరఖాస్తుదారు అనివార్య కారణాలవల్ల 90 రోజులలోగా దరఖాస్తు చేయలేకపోయినట్టు రాష్ట్ర / కేంద్ర సమాచార కమిషనర్ సంతృప్తి చెందితే, 90 రోజుల తర్వాతకూడా, అప్పీలును అనుమతించవచ్చు.
4. రెండవ అప్పీలును ఎలా వ్రాయాలి
తెల్ల కాగితం మీద మీ దరఖాస్తును వ్రాసి సమర్పించవచ్చు. దరఖాస్తును వ్రాయవచ్చు లేదా టైప్ చేయవచ్చు
కేంద్ర సమాచార కమిషనర్కు సమర్పించే దరఖాస్తు ఫారాన్ని హిందీ లేదా ఇంగ్లీషులోనే వ్రాయాలి, రాష్ట్ర సమాచార కమిషనర్కు సమర్పించే దరఖాస్తు ఫారం రాష్ట్రానికి చెందిన ఏదైనా భాషలో వుండవచ్చు
5. దరఖాస్తులో ఏమేమి వ్రాయాలి
అవసవసరమైన సమాచారాన్ని నిర్దేశించిన పద్ధతిలో, స్పష్టంగా వ్రాయాలి
దరఖాస్తుకు ఏఏ పత్రాలు జతచేస్తున్నది , పేజి నంబర్లతో సహా, పేర్కొంటూ విషయ సూచిక పేజీ వుండాలి
అన్ని పత్రాలను ఐదు కాపీలు తయారుచేయాలి (అవి: రెండవ అప్పీలు దరఖాస్తు , సమాచారాన్ని అందించాలన్న వినతిపత్రం, మొదటి అప్పీలు దరఖాస్తు కాపీ, పీఇఓ కు చెల్లించిన ఫీజు రశీదు మొదలైనవి) , వాటిని స్వయంగా ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి లేదా వేలిముద్ర వేయాలి. మీ దగ్గర వుంచుకోవడంకోసం అదనంగా ఒక కాపీ తీయించుకోవాలి.
6. దరఖాస్తును ఎలా పంపాలి
దరఖాస్తు 5 కాపీలు రిజిస్టర్ పోస్టు ద్వారా మాత్రమే పంపాలి
దరఖాస్తు ఫారానికి, అది అందినట్టు తెల్పడంకోసం, అక్నాలెడ్జిమెంటు కార్డునుకూడా జతచేయాలి
కేంద్ర సమాచార కమిషనర్కు సమర్పించే దరఖాస్తును ఆన్ లైన్లో, అంటే కంప్యూటర్ ద్వారా కూడా క్లిక్ చేసి, సమర్పించవచ్చు
7. సమాచారం అందింఛడానికి గడువు
సాధారణ పరిస్థితులలో 30 రోజులలోగా నిర్ణయాన్ని ప్రకటించాలి ; అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో 45 రోజుల వరకు అనే మినహాయింపు వుంది
కేంద్ర / రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయానికి దరఖాస్తు అందిన తేదీనుంచి గడువును లెక్కిస్తారు.
19. Appeals:
(1) Any person who, does not receive a decision within the time specified in sub-section (1) or clause
(a) of sub‑section (3) of section 7, or is aggrieved by a decision of the Central Public Information Officer or the State Public Information Officer, as the case may be, may within thirty days from the expiry of such period or from the receipt of such a decision prefer an appeal to such officer who is senior in rank to the Central Public Information Officer or the State Public Information Officer, as the case may be, in each public authority: Provided that such officer may admit the appeal after the expiry of the period of thirty days if he or she is satisfied that the appellant was prevented by sufficient cause from filing the appeal in time.
(2) Where an appeal is preferred against an order made by a Central Public Information Officer or a State Public Information Officer, as the case may be, under section 11 to disclose third party information, the appeal by the concerned third party shall be made within thirty days from the date of the order.
(3) A second appeal against the decision under sub‑section (1) shall lie within ninety days from the date on which the decision should have been made or was actually received, with the Central Information Commission or the State Information Commission: Provided that the Central Information Commission or the State Information Commission, as the case may be, may admit the appeal after the expiry of the period of ninety days if it is satisfied that the appellant was prevented by sufficient cause from filing the appeal in time.
(4) If the decision of the Central Public Information Officer or State Public Information Officer, as the case may be, against which an appeal is preferred relates to information of a third party, the Central Information Commission or State Information Commission, as the case may be shall give a reasonable opportunity of being heard to that third party.
(5) In any appeal proceedings, the onus to prove that a denial of a request was justified shall be on the Central Public Information Officer or State Public Information Officer, as the case may be, who denied the request.
(6) An appeal under sub‑section (1) or sub‑section (2) shall be disposed of within thirty days of the receipt of the appeal or within such extended period not exceeding a total of forty‑five days from the date of filing thereof, as the case may be, for reasons to be recorded in writing.
(7) The decision of the Central Information Commission or State Information Commission, as the case may be, shall be binding.
(8) In its decision, the Central Information Commission or State Information Commission, as the case may be, has the power to,—
(a) require the public authority to take any such steps as may be necessary to secure compliance with the provisions of this Act, including—
(i) by providing access to information, if so requested, in a particular form;
(ii) by appointing a Central Public Information Officer or State Public Information Officer, as the case may be;
(iii) by publishing certain information or categories of information;
(iv) by making necessary changes to its practices in relation to the maintenance, management and destruction of records;
(v) by enhancing the provision of training on the right to information for its officials;
(vi) by providing it with an annual report in compliance with clause (b) of sub‑section (1) of section 4;
(b) require the public authority to compensate the complainant for any loss or other detriment suffered;
(c) impose any of the penalties provided under this Act;
(d) reject the application.
(9) The Central Information Commission or State Information Commission, as the case may be, shall give notice of its decision, including any right of appeal, to the complainant and the public authority.
(10) The Central Information Commission or State Information Commission, as the case may be, shall decide the appeal in accordance with such procedure as may be prescribed.
Copyright © 2024 RTI ACTIVISTS ASSOCIATION
All Rights Reserved